డిజిటల్ యుగంలోనూ విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవర్చుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తుకు విద్యార్థులే పునాదులని, మంచి పుస్తకాలు చదవడం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్ని, సృజనాత్మక ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పాడేరు శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన హాజరై మాట్లాడారు. సమాజ నిర్మాణంలో కవులు, సాహితీవేత్తలు, కళాకారులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. గ్రంథ పఠనం ద్వారా సమాజంలోని వివిధ అంశాలపై అవగాహన పెంచుకోవడంతోపాటు సున్నితమైన సామాజిక సమస్యలపై సృజనాత్మకంగా స్పందించే సామర్థ్యం పెంపొందుతుందన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే పుస్తక పఠనాన్ని మంచి అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. పాటల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు చైర్మన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కుమార్ రాజా, గ్రంథపాలకురాలు మానస, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పుస్త పఠనంతో ఉజ్వల భవిష్యత్తు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సతీష్ కుమార్
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 17, 2026, 05:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)