ప్రజాశక్తి- భీమునిపట్నం
జాతీయ నెట్‌బాల్ పోటీలకు ఇద్దరు కేథరిన్ స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ నెల 13 నుంచి 15 వరకు అన్నమయ్య జిల్లా చిన్న తిప్పసముద్రంలో జరిగిన 70వ ఎస్‌జిఎఫ్ అంతర్ జిల్లా అండర్-17 నెట్‌బాల్ పోటీల్లో విశాఖ జిల్లా బాలికల జట్టు ప్రథమ స్థానం, బాలుర జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి విశాఖ జట్టులో ఆరుగురు కేథరిన్ స్కూల్ విద్యార్థులు పాల్గొనగా, సుప్రియ, లిఖిత, తన్వి బంగారు పతకం, పార్థ సాత్విక్, జి.జీవన్, మాధవ్ రజత పతకం సాధించారు. ఇందులో తన్వి, పార్థ సాత్విక్ జాతీయ నెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. వచ్చేనెల 6 నుంచి 10 వరకు మధ్యప్రదేశ్ సత్నాలో జరిగే జాతీయ పోటీల్లో వీరు పాల్గొంటారు.జాతీయ పోటీలకు కేథరిన్ స్కూల్ విద్యార్థులు ఎంపిక కావడంపై విద్యాసంస్థల అధినేత ఆలివర్ రాయి హర్షం వ్యక్తం చేశారు. ఆటలకు కేథరిన్ ఇచ్చే ప్రాధాన్యత, ప్రోత్సాహం, కోచింగ్ వల్లే ఇదంతా సాధ్యమైందని, స్పోర్ట్స్ ర్యాంకింగ్‌లో విశాఖ జిల్లాలో రెండో స్థానంలోనూ భీమిలి మండలంలో మొదటి స్థానంలో కేథరిన్ స్కూల్ కొనసాగుతోందన్నారు. విద్యార్థులతోపాటు కేథరిన్ స్కూల్ వ్యాయామ అధ్యాపక హెచ్‌ఒడి అనిల్‌కుమార్ ఇతర సిబ్బందిని అభినందించారు








కామెంట్‌లు (0)