నక్కపల్లి లో పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులను విశాఖపట్నం రేంజ్ ఐజి గోపీనాథ్ జట్టి మంగళవారం జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తో కలిసి పరిశీలించారు.అధునాతన సౌకర్యాలతో పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులు నాణ్యతగా చేపట్టాలని సూచించారు. నిర్ణీత సమయంలో భవన నిర్మాణం పనులను పూర్తి చేయాలన్నారు. హెటిరో డ్రగ్స్ కంపెనీ సి ఎస్ ఆర్ నిధుల నుండి నూతన హంగులతో పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులు చేపడుతున్నారు. భవన నిర్మాణ పనులను, మ్యాపును ఐజి గోపీనాథ్ జట్టి పరిశీలించారు. హెటిరో కంపెనీ ఏజీఎం ఈశ్వర శర్మతో భవన నిర్మాణ పనులపై చర్చించారు. నర్సీపట్నం డి.ఎస్.పి శ్రీనివాసరావు, సి ఐ జె మురళి పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)