జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని స్థానిక శాఖ గ్రంథాలయంలో విద్యార్థినీ విద్యార్థులకు ఆటపాటలు, పాటలు, ఉపన్యాసాలతో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ మాట్లాడుతూ.. నేటి సమాజం వేగంగా డిజిటలీకరణ దిశగా పయనిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు సామాజిక మాధ్యమాలు, డిజిటల్ మాధ్యమాల వినియోగంతో పాటు పుస్తక పఠనంపై కూడా ప్రత్యేక ఆసక్తి కనబరచాలని సూచించారు.గ్రంథ పఠనం ద్వారా మంచి అలవాట్లను అలవరచుకుని జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.ఆటపాటలు, పాటల పోటీలు, ఉపన్యాసాలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. సమాజం, దేశం పట్ల అంకితభావాన్ని పెంపొందించుకునేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు. పాటల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ముఖ్య అతిథులు బహుమతులు అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కుమార్ రాజా, గ్రంథపాలకురాలు ఎం. సత్యవతి, విద్యార్థినీ విద్యార్థులు, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు పుస్తక పఠనంపై ఆసక్తి చూపాలి : విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 17, 2026, 06:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)