ప్రజాశక్తి- భీమునిపట్నం
స్థానిక శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ . వారోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన మంగళవారం లెమన్ స్పూన్, ముగ్గుల పోటీలను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టిడిపి రాష్ట్ర మాజీ కార్యదర్శి నూకరాజు ఎం. లక్ష్మణరావు, మాజీ కౌన్సిలర్ పి. స్వర్ణలత, లావణ్య తదితరులు పాల్గొని పోటీల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉన్నతపాఠశాల విద్యార్థులను ఉత్సాహపరిచారు.

గ్రంథాలయ అధికారి మహేష్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీల్లో మహిళలు, విద్యార్థినులు పాల్గొని, ముగ్గులతో గ్రంథాలయ ఆవరణను రంగులమయం చేశారు.








కామెంట్‌లు (0)