ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్
విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్‌కిషోర్ గురువారం జిల్లాలోని ప్రభుత్వ భూములు, ఎపిఐఐసి పారిశ్రామిక పార్కులు, విఎంఆర్‌డిఎకు చెందిన భూములను విస్తృతంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆనందపురం, పద్మనాభం,పెందుర్తి మండలాల్లో కృష్ణాపురం, రెడ్డిపల్లి, జగన్నాథపురం, గిడిజాల, గొరింట, జి.ఎస్.అగ్రహారం, కనమాం, గుర్రంపాలెం, దబ్బంద గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ ఆయా ప్రాంతాల్లోని భూముల పరిస్థితి, పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను కేటాయించిన పారిశ్రామిక పార్కుల్లో పరిశ్రమల స్థాపన ప్రక్రియను వేగవంతం చేసి, పరిశ్రమలు త్వరితగతిన గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములపై ఆక్రమణలను అరికట్టేందుకు నిరంతరం నిఘా ఉంచాలని, ప్రభుత్వ భూములకు సంబంధించి ఎలాంటి ఆక్రమణలకూ తావులేకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో భీమిలి ఆర్‌డిఒ సంగీత్ మాధుర్, ఎపిపిఐఐసి జోనల్ మేనేజర్ సింహాచలం, విఎంఆర్ డిఎ ఎస్టేట్ ఆఫీసర్ దయానిధి, ఆయా మండల తహశీల్దార్లు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)