ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బాల్య వివాహ రహిత భారత్ లక్ష్యం

1 రోజు క్రితం

బాల్య వివాహ రహిత భారత్ లక్ష్యం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 05:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్ : బాల్యవివాహాల రహిత భారత్‌ అందరి లక్ష్యం కావాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ అన్నారు. శనివారం జాతీయ దత్తత అవగాహన మాసం, బాల్యవివాహ రహిత భారత్ 100 రోజుల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా, చట్టబద్ధమైన దత్తత విధానాలు, బాల్యవివాహాల నిర్మూలనపై రూపొందించిన అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు చట్టబద్ధమైన దత్తత నిబంధనలు, విధానాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బాల్యవివాహాల వల్ల కలిగే సామాజిక, ఆరోగ్యపరమైన దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వాటి నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ, సాధికారత అధికారి సిహెచ్ సంతోషి కుమారి, జిల్లా బాలల సంరక్షణ అధికారి కె. హరికృష్ణ, బాలల సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ బి.హరి వెంకటరమణ, కమిటీ సభ్యులు, జిల్లా బాలల సంరక్షణ విభాగ అధికారులు పాల్గొన్నారు.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్