శుక్రవారం, 09 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు విశాఖలో ప్రపంచ గుడ్డు దినోత్సవ వేడుకలు

1 గంట క్రితం

egg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 10:28 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- గుడ్డు సంపూర్ణ పోషకాహారం: నెక్‌ జోనల్‌ చైర్మన్‌ శ్రీధర్‌

ప్రజాశక్తి, ఎంవిపి కాలనీ : ప్రపంచ గుడ్డు దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నేషనల్‌ ఎగ్‌ కోఆర్డినేషన్‌ కమిటీ (నెక్‌) జోనల్‌ చైర్మన్‌ టి. శ్రీధర్‌ తెలిపారు. బీచ్‌రోడ్డులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుడ్డు సంపూర్ణ పోషకాహారమని, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. 1996 నుంచి ప్రపంచవ్యాప్తంగా వరల్డ్‌ ఎగ్‌ డే నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది 30వ వార్షికోత్సవం సందర్భంగా వేడుకలను మరింత ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

భారతదేశంలో కోట్లాది మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, వారికి అవసరమైన అనేక పోషకాలను అందించడంలో గుడ్డు కీలక పాత్ర పోషిస్తుందని శ్రీధర్‌ పేర్కొన్నారు. చిన్నారులకు ప్రతిరోజూ గుడ్డు అందించడం ద్వారా పోషకాహార లోపాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన తరాన్ని తీర్చిదిద్దవచ్చన్నారు. ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ఆర్కే బీచ్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. గుడ్డుతో తయారు చేసిన వివిధ రకాల వంటకాలను సబ్సిడీ ధరలకు అందించడంతో పాటు, ప్రజలకు వినోదాన్ని అందించే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, విశాఖ ఎంపీ శ్రీ భరత్‌, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ పౌల్ట్రీ ఫెడరేషన్‌ (ఏపీపీఎఫ్‌) స్టేట్‌ ట్రెజరర్‌ టి.యు. భాస్కర్‌, పూర్వ జోనల్‌ చైర్మన్‌ భరణికాన రామారావు, ఏపీపీఎఫ్‌ రీజినల్‌ ప్రెసిడెంట్‌ బి. సాయినాథరావు, నెక్‌ జోనల్‌ కోఆర్డినేటర్‌ ఎం.వి. అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్