సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆర్టీసీ బస్సులన్నీ మోడి మీటింగ్ కే ..!

01 ఆగస్టు, 2026

All RTC buses are for Modi's meeting!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 04:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-వేపాడ (విజయనగరం) : ఆగస్టు ఒకటి వేపాడ మండల కేంద్రం నుండి ఎస్ కోట ఆర్టీసీ డిపో నుండి వేపాడ మండల కేంద్రం నుండి సోంపురం జంక్షన్ మీదుగా ఎల్.కోట, కొత్తవల, పెందుర్తి, ఎన్ ఎడిమీదుగా విశాఖపట్నం ద్వారకా నగర్ ఆర్టీసి. కాంప్లెక్స్ కు రోజు వెళ్లే బస్సును అదేవిధంగా వేపాడమండల కేంద్రము నుండి ఆనందపురం కొత్తవలస మీదిగా ఎన్ఎడి మీదుగా విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ కు, వేపాడనుండి ఆనందపురం, కోటపాడు, పినగాడ మీదుగా గాజువాక ఆర్టీసీ కాంప్లెక్స్ కు వెళ్లే బస్సులు శనివారం ప్రధానమంత్రి భోగాపురం లో ఏర్పాటు చేసిన సమావేశానికి పురుమాయించడంతో నిత్యము ప్రయాణం సాగించి కూలి పనులు చేసుకునే కూలీలకు, ఫ్యాక్టరీలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వహించేవారు. వైద్య సేవలు పొందుటకు వెళ్లేవారు ఇబ్బందులకు గురై అధిక చార్జీలు ఇచ్చుకొని ఆటోలను ఆశ్రయించవలసి వచ్చింది అంటూ పలువురు వాపోయారు. ప్రజా ప్రతినిధులు సమావేశాలకు మారుమూల వేపాడ మండలానికి వేసిన ఆర్టీసీ బస్సులకు ఇస్తే బాగుంటుందని సంబంధిత అధికారులను , ప్రజాప్రతినిధులను మండల ప్రజలు కోరుతున్నారు.


నిర్మానుషంగా ఆర్టిసి కాంప్లెక్స్ - బస్సులన్నీ భోగాపురానికే - ప్రయాణికులను గాలికి వదిలేశారు -

ప్రజాశక్తి, విజయనగరం కోట : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సందర్భంగా విజయనగరం జిల్లా నుంచి ఏపీఎస్ఆర్టీసీ సుమారు 150 బస్సులను కార్యకర్తల, నాయకులు ప్రజలు మోడీ సభకు తరలించడానికి వెళ్లిపోవడంతో విజయనగరం ఆర్టిసి డిపో నిర్మానుష్యంగా కనిపించింది. దీంతో అక్కడకు చేరుకున్న ప్రయాణికులు బస్సులు లేక గంటల తరబడి నిరీక్షించవలసి వచ్చింది ప్రయాణికుల సౌకర్యార్థం ఉండవలసిన ఆర్టీసీ బస్సులు మోడీ సభకు వెళ్లడంతో ప్రయాణికుల ప్రయాణాలకు ఉపయోగించవలసిన బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు . ఆర్టీసీ అధికారులు ప్రయాణికులను గాలికి వదిలేసారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్