సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

తల్లి పాలు బిడ్డకు మొదటి టీకా : ఐసిడిఎస్ అధ్వర్యంలో తల్లి పాల వారోత్సవాలు

6 రోజుల క్రితం

vzm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 04, 2026, 04:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు జానకి

ప్రజాశక్తి- విజయనగరం : తల్లి పాలు వలన బిడ్డలకు రోగనిరోధక శక్తి పెరుగుతుందని, తల్లిపాలే బిడ్డకు మొదటి టీకా అని ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు జానకి అన్నారు. మంగళవారం పలు జిల్లాల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. విజయనగరంలోని లోగిస గ్రామంలో తల్లి పాల వారోత్సవాలు నిర్వహించారు. ఎస్ లింగాలవలస సెక్టార్ లోగిస క్లస్టర్ పరిధిలో తల్లి పాల విశిష్టతను వివరిస్తూ అవగాహన ర్యాలీ చేపట్టారు. తల్లి పాలతో బిడ్డకు మేధస్సు ,ఎదుగుదల కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సుభాషిణి, జయలక్ష్మి,చంద్రావతి, సుజాత,జయ,జానకి ,ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.


తల్లిపాల వారోత్సవాలు

ప్రజాశక్తి - జగ్గంపేట : ఐసిడిఎస్ అధ్వర్యంలో మంగళవారం మండలంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. మండలంలోని రాజపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని బాలింతలకు తల్లిపాల గురించి వైద్యురాలు పూజ వివరించారు. అలాగే మండలంలోని సగరపుపేట, స్థానిక గోపాల్ నగర్ అంగన్వాడి కేంద్రాల్లో తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతను సిడిపిఓ ఎమ్.పూర్ణిమ తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో ఎఎన్ఎం, ఆశా కార్యకర్తలు, సూపర్ వైజర్లు సునీత, అమ్మాజీ, అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, తల్లులు పాల్గొన్నారు.

kakinada

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్