ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : దేశ టెలికాం రంగాన్ని ప్రజల ప్రయోజనాల కోసం నిర్మించిన బిఎస్ఎన్ఎల్ ను బలోపేతం చేయాల్సిన సమయంలో, కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ రంగాన్ని బలహీనపరుస్తూ, కార్పొరేట్ గుత్తాధిపత్యానికి మార్గం సుగమం చేస్తున్నాయని, బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ కార్మికులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా దేశ టెలికాం స్వావలంబన, ప్రజలకు చౌకైన సేవలు, ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఉద్యమించాలని యూనియన్ లు జె ఏ సి పిలుపునిచ్చింది. బుధవారం కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ .... 4 జి, 5 జి విస్తరణకు అవసరమైన పెట్టుబడులు పెట్టి బిఎస్ఎన్ఎల్ ను బలోపేతం చేయాలన్నారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలను కల్పించాలన్నారు. ఖాళీలను భర్తీ చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ఉద్యోగులకు 3వ వేతన సవరణ ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లకు పెన్షన్ సవరణను ఆలస్యం చేయకుండా అమలు చేయాలనీ కోరారు. అఫోర్డబిలిటీ క్లా్ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టీకరణ, ఔట్సోర్సింగ్ విధానాలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ లు సాధన కోసం ఆగస్టు 7 న తలపెట్టిన చలో డిల్లీ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఉద్యోగులు కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో అలుగు వెంకట్రావు జిల్లా కార్యదర్శి, ఉద్యోగులు సిహెచ్ రవికుమార్ అక్కమ్మ పద్మ రేవాలలో రవణమ్మ మహిపాడ రమణ మధురకు వారు పాల్గొన్నారు.
ఆగస్టు 7 న ఛలో ఢిల్లీ పార్లమెంట్ : బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల పిలుపు
22 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 22, 2026, 04:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)