గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కలెక్టరేట్‌లో స్వచ్ఛత హి సేవ

1 గంట క్రితం

green
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 11:28 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్: స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో గురువారం స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రమదానం చేశారు. కలెక్టరేట్ ఆవరణలో పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు పిచ్చిమొక్కలను తొలగించారు. సేకరించిన చెత్తను ప్రత్యేక వాహనాల ద్వారా తరలించారు. ఈ కార్యమాన్ని ప్రారంభించిన జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్. సత్తిబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోజులో ఒక గంట సమయాన్ని కేటాయిస్తే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవచ్చని అన్నారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించడంతో పాటు స్వచ్ఛతను సామాజిక బాధ్యతగా మార్చేందుకు ప్రభుత్వం స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో మొక్కుబడిగా కాకుండా బాధ్యతగా భాగస్వాములు కావాలని కోరారు. విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి మాట్లాడుతూ స్వచ్ఛత హి సేవ కార్యక్రమం ప్రాధాన్యతను వివరించారు. ప్రజల నివాస ప్రాంతాలు, కాలనీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ స్వచ్ఛత కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సుమారు 14 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి పట్టణ పరిశుభ్రతకు శ్రీకారం చుట్టారని చెప్పారు. స్వచ్ఛత కార్యక్రమాల్లో మహిళలు కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్