ప్రజాశక్తి-విజయనగరం కోట : రైతులు అవసరమైన మేరకే యూరియాను పంటలకు వాడాలని విజయనగరం శాసనసభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. సోమవారం విజయనగరం మండలం చెల్లూరు ఆర్ఎస్కే పరిధిలో దుప్పాడ గ్రామంలో యూరియా పంపిణీ కార్డుల పంపకంతో పాటు యూరియాను రైతులకు అందించిన విజయనగరం శాసనసభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులు యూరియా అధిక మోతాదులో వాడడం వలన పంటలకు నష్టంతో పాటు ప్రజల ఆరోగ్యానికి కూడా విపరీతమైన నష్టం వాటిల్లుతుందని తెలిపారు ప్రపంచంలో యుద్ధ నేపథ్యంలో యూరియా పరిమితిగా వస్తుందన్నారు. సూర్య ఎక్కువ వాడడం వలన భూమి లో శక్తి కోల్పోయి పంట దిగుబడి తగ్గుతుంది అన్నారు. ఎలినినో ప్రభావంతో వాతావరణం మార్పులు ఎక్కువగా సంభవిస్తున్నాయి నీటి నిలువలు జాగ్రత్తగా వాడాలన్నారు. రాష్ట్ర తూర్పు కాపు చైర్మన్ పాలవలస యశస్విని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. మండల వ్యవసాయ అధికారి అడ్డూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయనగరం మండల పరిధిలోని ద్వారపూడి కొండకారకం చెల్లూరు రాకూడు జొన్నవలస కోరుకొండ ఆరు ఆర్ఎస్కే ల ద్వారా రైతులకు ఏపీ ఏఐఎంఎస్ 2.0 యాప్ ద్వారా రైతుల ఆధార్ బేసిల్లో యూరియాను అందించడం జరుగుతుందన్నారు. చెల్లూరు ఆర్ఎస్కే పరిధిలో దుప్పాడ కొనకరకం ద్వారపూడి రాకూడదు ఆరు ఏడు మెట్రిక్ టన్నుల పంపిణీకి చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్కే కేంద్రాల సిబ్బంది విజయనగరం జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు గంటా పోలినాయుడు, ప్రధాన కార్యదర్శి పాశి అప్పలనాయుడు, ద్వారపూడి టిడిపి పార్టీ అధ్యక్షులు నడుపు రాంబాబు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొద్దల నర్సింగ్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్ర నాయుడు, మండల నాయకులు పాల్గొన్నారు.
యూరియా కార్డుల పంపిణీ - రైతులకు యూరియా అందించిన ఎమ్మెల్యే
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 20, 2026, 03:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)