సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అక్కరాపల్లిలో ఫీవర్‌ సర్వే

03 అక్టోబర్, 2026

4918f7e9-bd87-4155-9e90-3b2a5dd46118.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 08:23 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ప్రజాశక్తి కథనానికి స్పందించిన అధికారులు

ప్రజాశక్తి - సంతకవిటి (విజయనగరం జిల్లా): అక్కరాపల్లి గ్రామంలో జ్వరాలు, దోమల బెడదపై ప్రజల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ అధికారులు శుక్రవారం ఇంటింటా ఫీవర్‌ సర్వే నిర్వహించారు. ప్రజాశక్తి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు గ్రామంలో ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, జ్వరంతో బాధపడుతున్న వారిని గుర్తించారు.

ఎంపీడీఓ శ్రీనివాసరావు, సంతకవిటి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ నాగేంద్ర ప్రసాద్‌ ఆదేశాల మేరకు ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. కాలనీలో మురుగునీరు నిల్వ ఉండటంతోపాటు దుర్వాసన వెదజల్లుతుండటంతో దోమల బెడద పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య సిబ్బంది ప్రజల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన పరీక్షలు చేపట్టారు. కార్యక్రమంలో హెచ్‌వీ సత్యవతి, ఎంఎల్‌హెచ్‌పీ తిరుమల, మేరీ, ఆరోగ్య సిబ్బంది శ్రీహరినాయుడు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్