సామాజిక శంఖారావం సర్వే లో సి ఐ టి యు డిమాండ్
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సామాజిక శంఖారావం లో భాగంగా శుక్రవారం చిన గోకపేట లో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సి ఐ టి యు జిల్లా కోశాధికారి ఏ. జగన్ మోహన్ రావు మాట్లాడుతూ .. 80 ఏళ్ల భారతంలో ఎప్పుడు పెచ్చులు ఊడిపడతాయో, ఏ వైపునుంచి పాములు వస్తాయో, వర్షం వస్తె ఎక్కడ ఉండాలో అని నిరంతరం ఆందోళనలో దళితులు జీవిస్తున్నారని అన్నారు. 1992 మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం లో 48 మంది ఇళ్లు నిర్మించి ఇచ్చారని, ప్రస్తుతం 60 కుటుంబాలు వరకు ఉంటున్నారని, అందులో 20 నుంచి 30 ఇల్లు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. కొంతమంది అప్పు చేసి కొద్దో గొప్ప రిపేర్లు చేసుకున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే సర్వే నిర్వహించి ఇల్లు నిర్మాణానికి అవసర మైన చర్యలు తీసుకోవాలని కోరారు. సామూహిక మరుగుదొడ్లు నిర్మాణానికి స్థలం చూడటం తప్ప పని జరగలేదని, మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రోడ్లు, కాలువలు శుభ్రం చేయాలన్నారు. ఈ సమస్యలపై సంతకాలు సేకరించి ఆగస్టు 24 న కలెక్టరేట్ వద్ద ధర్నాలో అధికారులకు అందజేస్తామని , పరిష్కారం కోసం పోరాటం చేస్తామని తెలిపారు.







కామెంట్‌లు (0)