20 నుంచి 30 వరకు నిరసన కార్యక్రమాలు
ప్రజాశక్తి – విజయనగరం కోట: డాక్యుమెంట్ రైటర్ల వృత్తికి భంగం కలిగించే జీవో నెం.396ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని విజయనగరం పశ్చిమ విభాగ రిజిస్టర్ దస్తావేజుల లేఖరుల యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర దస్తావేజుల లేఖరుల సంఘం పిలుపు మేరకు సోమవారం విజయనగరం పశ్చిమ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు ఓమ్మి ఈశ్వరరావు మాట్లాడుతూ, దస్తావేజుల లేఖరులు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా తమ వృత్తిని నిబద్ధతతో నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. తమ ఉపాధికి భంగం కలిగించేలా దస్తావేజుల తయారీ ప్రక్రియను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడం సరికాదని పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని అమలు చేయాలని భావిస్తే, ప్రైవేట్ ఏజెన్సీలతో పాటు తమకూ సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. జీవో 396ను వెనక్కి తీసుకునే వరకు ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో దస్తావేజుల లేఖరుల సంఘ సభ్యులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)