మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

జీవో నెంబర్ 396 ను వెనక్కి తీసుకోవాలి - ఈనెల 20 నుంచి 30 వరకు నిరసనలు

1 రోజు క్రితం

G.O. No. 396 must be withdrawn – Protests from the 20th to the 30th of this month.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 04:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయనగరం కోట : జీవో నెంబర్ 396 ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని విజయనగరం పశ్చిమ విభాగ రిజిస్టర్ దస్తావేజుల లేఖరుల యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం దస్తావేజుల లేఖరల వృత్తి సంఘం విజయనగరం పశ్చిమ విభాగం నాయకులు దస్తావేజుల లేఖరుల వృత్తికి భంగం కలిగిస్తూ ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తున్న కారణంగా జీవో నెంబర్ 96 ను వెనక్కి తీసుకోవాల్సిందిగా రాష్ట్ర దస్తావేజుల సంఘం పిలుపుమేరకు విజయనగరం పడమర సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాల్గొన్న ప్రెసిడెంట్ ఓమ్మి ఈశ్వరరావు మాట్లాడుతూ దస్తావేజర్లు ఎవరికి ఎటువంటి హాని తలపెట్టకుండా తమ వృత్తిని తాము నిబద్ధతతో చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నామన్నారు. మా పొట్టలో కొట్టి ప్రైవేటు వరకు ఈ పనులు అప్పజెప్పకూడదన్నారు ఒకవేళ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని తీసుకుంటే వారితో పాటు మాకు కూడా సమానంగా అవకాశాలు కలిగించాలన్నారు. ఈ నిరసన కార్యక్రమాలు ఈనెల 20 నుంచి 30వ తేదీ వరకు కొనసాగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖరుల సంఘ సభ్యులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్