సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వైభవంగా జీకే వన్ ప్రీమియం ప్రాజెక్ట్ బ్రోచర్ ఆవిష్కరణ

12 గంటల క్రితం

Grand launch of the 'GK One' premium project brochure.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 04:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ​విజయనగరం, తోటపాలెం వద్ద ఎస్.వి.ఎన్. గ్రూప్స్ ఆధ్వర్యంలో అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక "జి కె వన్ " ప్రీమియం 3 బి హెచ్ కె రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ బ్రోచర్‌ను రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్, వైసిపి నాయకులు కోలగట్ల వీరభద్ర స్వామి ఆవిష్కరించారు. ​సోమవారం తోటపాలెం లోని సైట్ ప్రాంగణంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ రంగంలో నిర్మాణ పనులను ఎంతో నాణ్యతతో, పకడ్బందీగా చేపడితే కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని, కొనుగోలుదారుల నమ్మకాన్ని చూరగొనవచ్చని వెంచర్ నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్వాహకులు ఈశ్వర్ కౌశిక్, కోలగట్ల శ్రావణిలకు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ​ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎస్.వి.ఎన్. గ్రూప్స్ నిర్వాహకులు జి. శ్రీనివాసరావు, సుజాత దంపతులు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ సంస్థల ప్రతినిధులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, పలువురు రాజకీయ నాయకులు ఉత్సాహంగా పాలుపంచుకుని ప్రాజెక్ట్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. విజయనగరంలో మారుతున్న జీవనశైలికి తగ్గట్టుగా వస్తున్న ఇలాంటి ప్రీమియం ప్రాజెక్ట్‌లు నగర అభివృద్ధికి దోహదపడతాయని ఈ సందర్భంగా వక్తలు అభిప్రాయపడ్డారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్