సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

డీఎస్సీ పరీక్షలో జరిగిన అక్రమాలపై జరిగే పోరాటంలో కలిసి రావాలి : మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి

6 రోజుల క్రితం

Join the fight against the irregularities in the DSC exam: Former Deputy Speaker Kolagatla Veerabhadra Swamy.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 04, 2026, 10:27 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

6 నుంచి 9 వరకు రిలే నిరాహారదీక్షలు

10 న నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయండి


ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6 తేదీ నుంచి 9 తేదీ వరకు రిలే నిరాహారదీక్షలు, 10 న జరగనున్న నిరసన కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన నివాసంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. మోస పూరితమైన వాగ్దానాలు అలవాటుగా మారిపోయింది చంద్రబాబు నాయుడికి అన్నారు. సూపర్ సిక్స్ అమలు చేసాను అని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. పులిని చూసి వాత పెట్టుకున్నట్లు చంద్రబాబు తీరు ఉందన్నారు. మనం గడప గడపకు తిరిగితే ఇళ్లకు వెళ్ళి చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇళ్ళకు వెళ్లకుండా కేవలం నాయకులు ఇళ్ళకు వెళ్ళి ప్రజలు మధ్య నిజాలు మాట్లాడే దైర్యం కూటమి నాయకులకు లేదన్నారు. పార్టీ చేపట్టిన డీఎస్సీ పై పోరాటం కార్యక్రమం 6 తేదీ నుంచి 9 తేదీ వరకు డీఎస్సీ పై రిలే నిరాహారదీక్షలు, 10 తేదీన నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. గ్రామాల్లో, వార్డుల్లో సమావేశాలు పెట్టీ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేటట్లు చూడాలని కోరారు. ప్రజల్లో మార్పు వచ్చింది అనడానికి ఇటీవల జగన్మోహనరెడ్డి శ్రీకాకుళం పర్యటనకు వచ్చిన ప్రజలు నిదర్శనమన్నారు. పోరాట కార్యక్రమాలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా నాయకులు,కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.సమావేశంలో పార్టీ నగర అధ్యక్షులు ఆసపు వేణు, మాజీ ఫ్లోర్ లీడర్ ఎస్ ఎస్ వి రాజేష్, కోలగట్ల శ్రావణి, ఈశ్వర్ కౌశిక్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్