ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో అక్టోబర్ 22 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించిన 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయి పాఠశాల క్రీడల తైక్వాండో పోటీల్లో విజయనగరం జిల్లాకు చెందిన కె. సాహిత్య కాంస్య పతకం సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా కాంస్య పతకం సాధించిన సాహిత్యను స్కూల్ గేమ్స్ కార్యదర్శి వాణిశ్రీ, శ్రీనివాస్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు గురాన అయ్యలు, న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సి.హెచ్. వేణుగోపాలరావు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి విజయనగరం జిల్లాకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ సాహిత్యకు శుభాకాంక్షలు తెలియజేశారు.








కామెంట్‌లు (0)