మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పిఓటి చట్టం క్రింద తీసుకున్న ప్రభుత్వ భూమిలో పేదలకు పట్టాలు ఇవ్వాలి

14 జులై, 2026

vzm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 14, 2026, 04:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా

ప్రజాశక్తి...విజయనగరం టౌన్ : విజయనగరం కార్పొరేషన్ పరిధిలో ఉన్న 30వ వార్డు ధర్మపురిలో ఉన్న ఎస్.నెం. 86/1,2,3,4.5 ఎ. 3.77 సర్వేలోనున్న గయాలు ప్రభుత్వ భూమినీ పేదలకు ఇవ్వాలని బడుగు బహీన వర్గాల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నా ను ఉద్దేశించి సంఘం నాయకులు రెడ్డి నారాయణరావు మాట్లాడుతూ .. చాలా కాలంగా ఆ భూమి ఖాళీగానే ఉందన్నారు. బడుగు బలహీన వర్గాలు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కనుమరుగైన ప్రభుత్వ భూమిని గుర్తించి నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని అనేక రూపాల్లో పోరాటాలు ఫలితంగా తమరు గుర్తించి అమ్మిన వారికి, కొన్న వారికి పి ఓ టి చట్టం క్రింద తేది 23-03-2026 న ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లుగా 90 రోజులు గడువు ఇస్తూ వారికి తెలియజేసిందని అన్నారు. అయినా నేటి వరకు జిల్లా కలెక్టర్‌కి గాని, ఆర్.డి.ఓకి గాని తెలియజేసినట్లుగా ఏవిధమైన సమాచారం లేదని అన్నారు. తక్షణమే తహశీల్దారు జోక్యం చేసుకొని ప్రభుత్వ భూమికి చెందిన 3.77 సెంట్లలో వెంటనే నిరుపేదలకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్