ప్రజాశక్తి- వేపాడ : వేపాడ మండలంలోని సోంపురం, సింగరాయ గ్రామ సచివాలయాలను ఎంపీడీవో సిహెచ్ సూర్యనారాయణ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సిబ్బంది రోజువారి హాజరు పట్టికను పరిశీలించారు. ఈరోజు విధులకు హాజరు కాని వారికి వెంటనే నోటీసులు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు అనంతరం స్వచ్ఛభారత్, సచివాలయ సిబ్బంది రోజువారి స్వచ్ఛభారత్ కార్యక్రమాలను గురించి వివరించారు. గ్రామాన్ని ఆరోగ్యవంతంగా ఉండే విధంగా కష్టపడి పని చేస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు బ్లౌజులు, రైన్ కోట్స్, బూట్స్, ముళ్లపారలు, రక్షణ కొరకు వర్షానికి తల తడకుండా టోపీలు సమకూర్చాలని, ఆ బాధ్యత పంచాయతీ కార్యదర్శులదేనని ఆదేశించారు. అలాగే వెల్నెస్ సెంటర్ సిహెచ్వోలు, ఎఎన్ఎమ్‌ఒలు గ్రామాలలో వ్యాధులు బారిన పడకుండా ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇది మన అందరి బాధ్యత అని, గ్రామాలు పరిశుభ్రంగా ఉన్న నాడే ఆరోగ్యవంతంగా ఉంటామని ఎంపీడీవో తెలిపారు. ఈకార్యక్రమంలో సోంపురం పంచాయతీ కార్యదర్శి కృష్ణారావు, సింగరాయి పంచాయతీ కార్యదర్శులు సత్యవతి, సచివాలయాలలో పనిచేస్తున్న సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామ సచివాలయాల్లో ఎంపీడీవో ఆకస్మిక తనిఖీలు
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 06, 2026, 03:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)