శుక్రవారం, 30 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ‌లో కొలుసు జేశ్విత ప్రతిభ

23 గంటల క్రితం

Outstanding performance by Kolusu Jeswitha at the national-level badminton tournament
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 04:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ముంబైలో అక్టోబర్ 27 నుంచి నవంబర్ 1, 2026 వరకు నిర్వహిస్తున్న యోనెక్స్–సన్‌రైజ్ ఆల్ ఇండియా సబ్-జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో విజయనగరానికి చెందిన కొలుసు జేశ్విత ప్రతిభ కనబరిచింది. అండర్–13 బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో క్వాలిఫయింగ్ రౌండ్‌లో విజయాలు సాధించి మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. జాతీయ స్థాయి పోటీల్లో ఈ ఘనత సాధించడం పట్ల క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా జేశ్వితను తీర్చిదిద్దుతున్న కోచ్ గుంట్రోతు శ్రీనివాసరావును, జేశ్విత తల్లిదండ్రులను డీఎస్ఏ విజయనగరం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ విజయనగరం సిటీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు గురువారం అభినందించారు. క్రీడాకారిణి విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం, సహకారం ఎంతో కీలకమని పేర్కొంటూ, జేశ్విత భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్