ప్రజాశక్తి - పోరుమామిళ్ల రూరల్ (కడప) : పోరుమామిళ్ల మండల తహశీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ రికార్డులు అదృశ్యం కావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే ... కార్యాలయంలో భద్రపరిచిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన రిజిస్టర్లు మాయమయ్యాయి. వందలాదిమంది లబ్ధిదారుల పేర్లు, ఫోన్ నెంబర్లు, సర్టిఫికెట్ నెంబర్లు, జారీ తేదీలతో కూడిన ఈ రిజిస్టర్లు కనిపించకుండా పోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రిజిస్టర్లను ఉపయోగించి నకిలీ సర్టిఫికెట్లు సృష్టించేందుకు ఎవరైనా మాయం చేశారా ? లేక సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జరిగిందా ? అనేది తేలాల్సి ఉంది. రిజిస్టర్లు లేకపోవడంతో పాత సర్టిఫికెట్ల ధృవీకరణకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రికార్డుల భద్రతకు తహశీల్దార్, కార్యాలయ సూపరింటెండెంట్ బాధ్యత వహించాలి. ఈ ఘటనపై సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పోరుమామిళ్ల ఎమ్మార్వో కార్యాలయంలో కీలక రికార్డులు మాయం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 30, 2026, 03:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)