ప్రజాశక్తి-కొండాపురం (ప్రకాశం) : ప్రకాశం జిల్లా పామూరు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన కారు ప్రమాదంలో కొండాపురం మండలం చౌటిపల్లె గ్రామానికి చెందిన బొమ్మిరెడ్డి గారి రవికుమార్ రెడ్డి (35) (చిన్నబాబు) మృతి చెందాడు. బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు గురువారం రాత్రి 12 గంటల సమయంలో కారులో తాడిపత్రి నుండి విజయవాడకు బయలుదేరారు. ఆ కారులో రవికుమార్ రెడ్డితో పాటు మరో నలుగురు కూడా వెళ్ళారు. వీరు వెళుతున్న కారు ఈరోజు తెల్లవారుజామున, సుమారు 3 గంటల సమయంలో ప్రకాశం జిల్లా పామూరు మండలంలో జాతీయ రహదారిపై డివైడర్ ను ఢీ కొట్టడంతో పెను ప్రమాదం జరిగింది. డ్రైవింగ్ చేస్తున్న రవి కూమార్ రెడ్డి ఆక్కడికక్కడే మృతి చెందాడని మిగిలిన నలుగురికి గాయాలైనట్లు తెలిపారు. రవికుమార్ రెడ్డికి భార్యతో పాటు 5 నెలల కుమార్తె ఉన్నట్లు బంధువులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి ....
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 30, 2026, 03:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)