బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

15 నెలలుగా రావల్సిన జీతాలను చెల్లించాలంటూ.. పంచాయతీ కార్మికుల నిరసన

1 గంట క్రితం

Panchayat workers protest demanding payment of outstanding salaries for 15 months.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 05:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బకాయిలు ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలి

నాలుగు రోజుల్లో జీతాలు చెల్లించకపోతే ఉధృతం చేస్తాం

ఆగస్టు ఏడు నుండి నిరవధిక సమ్మె


ప్రజాశక్తి-గరివిడి (విజయనగరం) : 15 నెలలుగా రావల్సిన జీతాలను చెల్లించాలంటూ ... పంచాయతీ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులంతా నిరసన తెలిపారు. గరివిడి మండలం మేజర్ పంచాయతీ కార్యాలయంలో గత 15 నెలల నుండి జీతాలు చెల్లించాలని సిఐటియు నాయకులు అంబల్ల గౌరి నాయుడు తెలిపారు. ఆందోళన అనంతరం పంచాయతీ కార్యాలయంలో ఈవో వేణుగోపాల, గరివిడి ఎస్సై బి.లోకేశ్వరరావు మధ్య కార్మికుల జీతాలపై చర్చలు జరిగాయి. గత పది హేను నెలల నుండి జీతాలు లేకపోవడంతో తమ కుటుంబాలు రోడ్ల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యాలయంలో తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీనిపై గరివిడి ఎస్సై బి. లోకేష్ జోక్యం చేసుకుంటూ ఇన్నాళ్లు జీతాలు ఇవ్వకపోవడం తప్పే కదా అని అన్నారు. దీనిపై జిల్లా అధికారులతో మాట్లాడుతామని ఈవో వేణుగోపాలరావు తెలిపారు. గతంలో నాలుగు నెలలు జీతాలు చెల్లిస్తామని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు నాయకులు అంబల్ల గౌరి నాయుడు మాట్లాడుతూ .... నాలుగు రోజుల సమయం ఇస్తున్నాం నాలుగు రోజుల్లో గత పది హేను నెలల జీతాలు చెల్లించకపోతే జిల్లా స్థాయిలో మరింత సమ్మె ఉద్యతం చేస్తామని తెలిపారు. స్పెషల్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం తో మాట్లాడి వివరణ ఇస్తామని ఈఓ వేణు గోపాలరావు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్