నోటిఫికేషన్ విడుదల
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం నగరపాలక సంస్థలో ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియలో భాగంగా వార్డు సభ్యుల పదవుల రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు ఈనెల 8 వతేదీ నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ప్రభుత్వం నుంచి అందుకు తగిన ఆదేశాలు రావడం జరిగింది. ఈ మేరకు ఈనెల 8 నుంచి 21 వతేదీ వరకు 14 రోజుల పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ చేపడతారు. ఈ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఇప్పటికే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియపై విధివిధానాలు తెలియజేసేందుకు బిఎల్ఎలు, అడ్మిన్ ప్లానింగ్ కార్యదర్శులు కు తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నగరపాలకసంస్థలో 62 డివిజన్లు ఉండగా 2,23,050 ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,08,010 మంది పురుషులు,1,15,015 మంది స్త్రీలు, 25 మంది ఇతరులు ఉన్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితాలను విడుదల చేశారు. ఈ నేపద్యంలో 8 తేదీ నుంచి 12 తేదీ వరకు కులాలు వారిగా ఓటర్లను గుర్తిస్తారు. గుర్తించిన వారిలో ఓటర్లు జాబితాలో ఎస్టీ ఓటర్లను బ్లూ పేన్ తో మార్క్ చేస్తారు, ఎస్సీ ఓటర్లను రెడ్ పెన్ తో, మహిళా ఓటర్లను బ్లాక్ పెన్ తో గుర్తిస్తారు. ఈ ప్రక్రియ 12 తేదీ వరకు చేపడతారు. 13న గుర్తించిన ఓటర్లు జాబితా డ్రాఫ్ట్ ను బహిరంగ పర్చనున్నారు. అనంతరం మూడు రోజులు అంటే 14 తేదీ న మండల తహసిల్దార కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయంలో ఓటర్లు జాబితా ను ఉంచడం మార్కు చేయడం జరుగుతుంది. అనంతరం 15 తేదీ నుంచి 17 తేదీ వరకు మూడు రోజులు పాటు అభ్యంతరాలకు అవకాసం ఇవ్వడం జరిగింది. అనంతరం 19,20 తేదీల్లో రెండు రోజుల వచ్చిన అభ్యంతరాలపై ఫీల్డ్ లో పరిశీలించి నిర్ధారించనున్నారు. 21 తేదీన వార్డుల వారీగా కులాలు వారిగా ఓటర్లు.తుది జాబితాను ప్రకటించనున్నారు. మొత్తం 14 రోజులు పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది.







కామెంట్‌లు (0)