మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సమస్యలు పరిష్కారం చేయకుంటే సమ్మెకు సిద్ధం : ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్

10 జులై, 2026

Ready to strike if issues are not resolved: AP Municipal Workers Union
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 03:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కారం చేయకుంటే సమ్మెకు సిద్ధంగా ఉన్నామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు రంగరాజు, పి.కామేష్ లు తెలిపారు. శుక్రవారం యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ... విజయనగరం నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు వారి హక్కులు సమస్యలు పలు సమస్యలు అధికారులు పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రధానంగా 365 రోజులు పనిచేస్తున్న కార్మికులకు సెలవు దినములు వారాంతపు సెలవులు పండగ సెలవులు జాతీయ సెలవులు మంజూరు అమలు కావడం లేదన్నారు. సచివాలయానికి తగ్గట్టు సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. కార్మికులపై వేధింపులు ఆపాలన్నారు. పనిముట్లు లేక కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబాలలో ఒకరికి ఉపాధి కల్పించాలని ఈ సమస్యలు తక్షణమే పరిష్కారం చేయకపోతే సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఈ విలేకర్ల సమావేశంలో కార్మికులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్