ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : గజపతినగరం నియోజకవర్గంలో రెడ్డివానివలస గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణ పనులను వెంటనే వేగవంతం చేసి పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ,తల్లిదండ్రులతో సోమవారం జిల్లా కలెక్టర్ ఆఫీస్ కి ర్యాలీ గా వెళ్లి ఎదుట నిరసన కార్యక్రమం చెయ్యడం జరిగింది. అనంతరం గ్రీవెన్స్‌లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి డి.రాము మరియు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.సోమేష్ మాట్లాడుతూ రెడ్డివానివలస ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 28 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. విద్యార్థులకు సొంత పాఠశాల భవనం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. పాఠశాల భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, పాఠశాల భవన నిర్మాణ పనులను వెంటనే వేగవంతం చేసి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మన రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వచ్చినపుడు మీ గ్రామానికి పాఠశాలకి సొంత భవనం నిర్మాణం చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.కానీ అధికారం వచ్చి నేటికి 2 సంవత్సరాలకు పైగా అవుతున్న ఇప్పటికీ పట్టించుకోలేదని విమర్శించారు. ఈ సందర్భంగా దీనిపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించి విద్యార్థులుకు పాఠశాలకు సొంత భవనం పనులు వేగవంతం చేసి ఏర్పాటు చేసి న్యాయం చెయ్యాలని అన్నారు.విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని దీనికి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా విద్యా శాఖ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షులు అర్.శిరీష జిల్లా కమిటీ సభ్యులు సూరిబాబు,నందిని నాయకులు లక్ష్మీ మరియు విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు
రెడ్డివానివలస గ్రామం పాఠశాల భవన నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలి : ఎస్ఎఫ్ఐ
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 20, 2026, 04:11 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)