గోడ పత్రికను ఆవిష్కరించిన డిఎస్డిఓ, పారా అథ్లెటిక్స్ అసోసియేషన్ నాయకులు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : డిసెంబర్ 1,2 తేదీల్లో విజయనగరం జిల్లా కేంద్రంలో పారా క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వి.రామస్వామి, జిల్లా అధ్యక్షులు కె దయానంద్ లు తెలిపారు. శనివారం రాజీవ్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర పోటీలు గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ... ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ , పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పారా క్రీడా పోటీలు 2026 డిసెంబర్ 1, 2 తేదీల్లో విజయనగరం రాజీవ్ క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్నామనీ తెలిపారు.ఈ పోటీలలో 26 జిల్లాల నుండి జిల్లా స్థాయి క్రీడా పోటీలలో ఎంపికైన 13 సంవత్సరాలు పైబడిన సుమారు 2000 మంది బాలబాలికలు, పురుషులు, మహిళలలు పాల్గొనున్నారన్నారు.
పారా బ్యాడ్మింటన్, పారా టేబుల్ టెన్నిస్,పారా తైక్వాండో, వీల్బైర్ ఫెన్సింగ్, బ్లెండ్ గోల్బాల్, పారా అథ్లెటిక్స్ విభాగంలో పోటీలు జరగనున్నట్లు తెలిపారు.
పోటీలు - ప్రారంభోత్సవ కార్యక్రమం
తేదీ డిసెంబర్ 01 న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయి లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన దివ్యాంగుల క్రీడా కారులను సత్కరించడం జ ఇగుతుందన్నారు. తేదీ డిసెంబర్ 02 న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు నజరుగుతాయన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులు కు కోచ్లు, మేనేజర్లు, ఎస్కార్లకు వసతి మరియు భోజన సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. దివ్యాంగ క్రీడాకారుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించడమే ఈ పోటీల ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు జాతీయ పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. విలేకర్ల సమావేశంలో ప్రేమ్ భరత్ నెహ్రూ యువ కేంద్రం అధికారి పాల్గొన్నారు.








కామెంట్లు (0)