బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు శికారుగంజి విద్యార్థినుల ఎంపిక

2 గంటల క్రితం

Students from Shikarganj selected for state level hockey competitions
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 04:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

క్రీడలతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు : మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎం.ఈశ్వరరావు


ప్రజాశక్తి-దత్తిరాజేరు (విజయనగరం) : చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం ద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని శికారుగంజి ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎం. ఈశ్వరరావు అన్నారు. ఇటీవల విజయనగరంలోని విజ్జీ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-14, 17, 19 జిల్లాస్థాయి హాకీ జట్ల ఎంపిక పోటీల్లో తమ పాఠశాల విద్యార్థినులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఆయన బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు (పీడీ) సీహెచ్. రాజేష్ మాట్లాడుతూ ... అండర్-19 విభాగంలో పాఠశాలకు చెందిన వి. యశ్వంతి, ఎం. యమున, ఎల్. అలేఖ్య రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు వెల్లడించారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో కర్నూలు జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్‌లో వీరు జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై పాఠశాలకు, ప్రాంతానికి గుర్తింపు తీసుకొచ్చిన విద్యార్థినులను ప్రిన్సిపాల్ ఎం. ఈశ్వరరావు, పీడీ రాజేష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్