శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

టెట్ పై యు టి ఎఫ్ పోరాటం - చలో విజయవాడ పోస్టర్ ఆవిష్కరణ

1 గంట క్రితం

Tet War poster unveiled
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 04:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -మామిడికుదురు : ఇన్‌సర్వీస్‌ ఉపాద్యాయులకు టెట్ రద్దు చేయాలని, టెట్ పరీక్షలు అర్హత మార్కులు తగ్గించాలని, ఆన్ లైన్ లో టెట్ నిర్వహించాలని, ఉపాధ్యాయులు బోధిస్తున్న సబ్జెక్టుల్లో మాత్రమే పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ మూడో తేదీన విజయవాడ లో జరగబోయే ధర్నాకు ఆహ్వానిస్తూ పోస్టర్ ఆవిష్కరించారు. మండల యూటీఎఫ్ ఆధ్వర్యంలో మామిడి కుదురు హైస్కూల్ నందు శనివారం పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా కోశాధికారి చెల్లుబోయిన కేశవరావు, మండల అధ్యక్షులు జి. నాగేంద్రప్రసాద్ ,ప్రధాన కార్యదర్శి ఎమ్ ఎన్ వెంకటేశ్వరరావు,రాష్ట్ర కౌన్సిలర్ కె. అరుణ జ్యోతి, ఏవి శ్యామలావతి, వి. మహాలక్ష్మి, మొహిద్దిన్, బళ్ళ సతీష్, ఎన్ రఘురామయ్య, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్