సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మున్సిపల్ కార్మికుల వయోపరిమితి 62ఏళ్ల కు పెంచాలి

1 గంట క్రితం

WhatsApp Image 2026-10-12 at 1.34.01 PM.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 02:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సి ఐ టి యు డిమాండ్

నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా, కమీషనర్ కి వినతి

ప్రజాశక్తి..విజయనగరం టౌన్ : మున్సిపల్ కార్మికుల వయోపరిమితి 62 ఏళ్లకు పెంచాలని, మరణించిన, దీర్ఘకాలం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్మికుల బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలని సిఐటియు నాయకులు డిమాండ్‌ చేశారు. 1972 గ్రాట్యూటీ చట్టం ప్రకారం మున్సిపల్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించే విధంగా జీవో ఇవ్వాలని, సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు పర్మినెంట్ చేయాలని, థర్డ్ పార్టీ కార్మికులకు ఆప్కాస్ జీతాలు ప్రతినెల 7వ తేదీ లోపు చెల్లించాలని, పనిముట్లు రక్షణ పరికరాలు ఇవ్వాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం సోమవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి భాస్కరరావు, ఏ జగన్మోహన్ రావులు మాట్లాడుతూ 2023డిసెంబర్ 26నుంచి జనవరి 11వరకు 17రోజులు సమ్మె సందర్భంగా రిటర్మెంట్ బెనిఫిట్ కోసం అప్పటి ప్రభుత్వంతో రాత ఒప్పందం జరిగి నేటికి మూడేళ్లయిన ఇంతవరకు జీ ఓ ఇవ్వకపోవడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దసరా పండగ సందర్భంగా పనిముట్లు,రక్షణ పరికరాల కొరతను పరిష్కరించాలన్నారు. థర్డ్ పార్టీ కార్మికులకు బకాయి జీతాలు చెల్లించాలన్నారు. మహిళలు పురుషులు కలిసి పనిచేస్తున్న చోట మహిళా వేధింపులు నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కమిషనర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా శ్రామిక మహిళా విభాగం కన్వీనర్ జీ కుమారి, కమిటీ సభ్యులు రజిని, మోహన్, నాయకులు శ్రీను, రామచంద్రరావు, నాగమ్మ, సూరి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్