స్టాక్‌హోమ్ : ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం అమెరికా శాస్త్రవేత్తలు రాబర్ట్ ఇ. హాల్, మైఖేల్ వుడ్‌ఫోర్డ్‌లకు దక్కింది. 2026 సంవత్సరానికి గాను వారిని ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సోమవారం ప్రకటించింది. ‘స్థూల ఆర్థిక స్థిరీకరణకు సూక్ష్మ ఆర్థిక పునాదులు’ అంశంపై రాబర్ట్ ఇ. హాల్, మైఖేల్ వుడ్‌ఫోర్డ్‌లు చేసిన కృషికి గాను ఈ అవార్డును ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
కాలిఫోర్నియాకు చెందిన రాబర్ట్ ఇ. హాల్ 1967లో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి)లో పిహెచ్‌డి పూర్తి చేశారు. ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మసాచుసెట్స్‌కు చెందిన వుడ్‌ఫోర్డ్ సైతం ఎమ్‌ఐటి నుంచి 1983లో పిహెచ్‌డి పూర్తి చేశారు. కొలంబియా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఈ ఇద్దరు అభివృద్ధి చేసిన కొత్త ఆర్థిక నమూనాల ఆధారంగా సరైన సమయంలో తీసుకునే ఆర్థిక, ద్రవ్య విధాన చర్యలు ఆర్థిక వ్యవస్థలోని హెచ్చుతగ్గులను తగ్గించగలవని నిరూపితమయ్యాయి. గత సోమవారం వైద్య రంగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రకటన నేటితో ముగసింది.








కామెంట్‌లు (0)