సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆగస్టు 10 న చలో కలెక్టరేట్ లో పాల్గొంటున్నాం : ఆశా వర్కర్లు

6 రోజుల క్రితం

vzm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 04, 2026, 04:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పి హెచ్ సి వైద్యులకు ఆశా వర్కర్లు వినతి

ప్రజాశక్తి - విజయనగరం టౌన్ : ఆగస్టు 10న చలో కలెక్టరేట్ ధర్నాలో పాల్గొంటున్నామని ఆశా వర్కర్లు స్పష్టం చేశారు. మంగళవారం రాకోడ్ యూపీహెచ్సీ, విజయనగరం అర్బన్ హెల్త్ సెంటర్స్ లో మెడికల్ ఆఫీసర్లకు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు మహాలక్ష్మి మాట్లాడారు. ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం 10 లక్షలు, అర్హులైన వారికి ఏ ఎన్ ఎం లుగా ప్రమోషన్లు , ఈఎస్ఐ పీఎఫ్, గ్రాట్యూటీ , రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర డిమాండ్ల కోసం ధర్నాలో పాల్గొంటున్నామని తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో నాగమ్మ ,ఆదిలక్ష్మి, మంగమ్మ, అప్పయమ్మ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్