సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆగస్టు 10 న విధులకు హాజరు కాలేం

4 రోజుల క్రితం

vzm-1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 04:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ కిరణ్ కు వినతి

ప్రజాశక్తి.. విజయనగరం : ఆగస్టు 10న విధులకు హాజరుకాలేమని మునిసిపల్‌ కార్మికులు గురువారం మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ కిరణ్ కు వినతి పత్రం ఇచ్చారు. వేతనాల పెంపు, రిటైర్ మెంట్ బెనిఫిట్స్ , పర్మినెంట్, 12 పి ఆర్సీ, ఇంజనీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు, పంపు హౌస్, లీకులు, వాల్ ఆపరేటర్లు, ప్లాంటేషన్ స్ట్రీట్ లైట్, విలీన ప్రాంత కార్మికులకు అప్ప్కాస్ కార్మికులతో సమానంగా వేతనాలు, బకాయి జీతాలు చెల్లింపు తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆగస్టు 10న జరిగే కలెక్టరేట్ ధర్నాలో పాల్గొంటున్నామని, విధులకు హాజరుకాలేమని తెలియజేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) విజయనగరం కార్పొరేషన్ కమిటీ ఆధ్వర్యంలో మేనేజర్‌కి గురువారం వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు బి. భాస్కరరావు, ఏ జగన్మోహన్రావు, సభ్యులు కే. ఆదినారాయణ, సి హెచ్ భాస్కర్, కే.చంద్ర రావు, వై. పారీ నాయుడు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్