మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ముఠా కళాశీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలి : సిఐటియు

1 గంట క్రితం

vzm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026, 12:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సిఐటియు నేత రెడ్డి శంకరరావు డిమాండ్

ప్రజాశక్తి..విజయనగరం టౌన్ : ముఠా కళాశిలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఏపీ బేవరిజెస్ ముఠా కళాశి కార్మికులు డిపో వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. డిపోవద్ద జరిగిన నిరసన లో యూనియన్ అధ్యక్షులు రెడ్డి శంకరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షలాది మంది ముఠా కార్మికులు ప్రతీ రోజు అనేక రకాల వస్తులు ఎగుమతి, దిగుమతి లు చేస్తున్నారు. వారు బరువు లు ఎత్తి, దించేటపుడు జరిగే ప్రమాదాలకి జరిగే నష్టానికి ప్రభుత్వం కనీస బాధ్యత తీసుకోవడం లేదని ఆయన అన్నారు. అలాగే వయసుమళ్లిన తరువాత పెన్షన్ ఇవ్వడంలేదని, కనీసచట్ట బద్ద హక్కులైన ఈ ఎస్ ఐ, పి ఎఫ్, ఇన్సూరెన్స్ లాంటివి కుడా కల్పించడం లేదని అన్నారు. దీంతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కనీస చట్ట బద్ధ హక్కులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశి సంఘం నాయకులు శ్రీను, సత్తిబాబు, రామకృష్ణ, మేస్త్రి రాజు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్