ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ లకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే బండారు
ప్రజాశక్తి - ఆలమూరు : ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కృషితో ఆలమూరు మండలంలోని నర్సిపూడి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి సుమారు రూ.3 కోట్లు మంజూరయ్యాయి. నర్సిపూడి గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సబ్ స్టేషన్ నిర్మాణానికి నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ లకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మంగళవారం కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సబ్ స్టేషన్ నిర్మాణంతో నర్సిపూడి పరిసర గ్రామాల ప్రజలకు లో వోల్టేజి, తదితర విద్యుత్ సమస్యలు తీరనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల దీనికి సంబంధించిన స్థలాన్ని నర్సిపూడి వాటర్ ట్యాంక్ డంపింగ్ యార్డ్ల మధ్య కేటాయించడం జరిగిందన్నారు. ఈ స్థలాన్ని గ్రామస్తులందరూ ఏకాభిప్రాయంతో నిర్ణయించినట్లు తెలిపారు.








కామెంట్‌లు (0)