మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మద్రాస్ హైకోర్టులో టివికెకు ఉపశమనం

1 గంట క్రితం

Madras hc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026, 12:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై : తమిళనాడు పాలక పార్టీ టివికెకు మద్రాస్‌ హైకోర్టు ఉపశమనం కలిగించింది. ఆరుగురు అన్నాడిఎంకె ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తూ తమిళనాడు స్పీకర్‌ జె.సి.డి. ప్రభాకర్‌ తీసుకున్న నిర్ణయాన్ని మద్రాస్‌ హైకోర్టు మంగళవారం సమర్థించింది. చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌.ఎ.ధర్మాధికారి, జస్టిస్‌ జి. అరుల్‌ మురుగన్‌లతో కూడిన ధర్మాసనం ఈవ్యవహారాన్ని విచారించి, ఎమ్మెల్యేల రాజీనామాలు వాస్తవమైనవేనని నిర్థారించింది. అన్నాడిఎంకె ఎమ్మెల్యేల రాజీనామాలు వారిపై అనర్హత వేటు వేసే ప్రక్రియకు అడ్డుకావని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే, ఈ ప్రక్రియను రెండు నెలల్లోగా పూర్తి చేయాలని అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించింది. స్పీకర్‌ నిర్నయం చెల్లుబాటు అవుతుందని, విస్తృతమైన విచారణ అవసరం లేదని పేర్కొంది.

సి.విజయభాస్కర్‌, మరగతం కుమారవేల్‌, సత్యభామ, ఇసాక్కి సుబ్బయ్య, జయకుమార్‌, ఎం.ఆర్‌.విజయభాస్కర్‌లు ఈ ఏడాది ప్రారంభంలో తమ పదవులకు రాజీనామా చేసి, సిఎం విజయ్‌ నేతృత్వంలోని టివికెలో చేరారు. అసెంబ్లీ స్పీకర్‌ వారి రాజీనామాలను ఆమోదించారు. దీంతో ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అన్నాడిఎంకె విప్‌ అగ్రి కృష్ణమూర్తి, నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ పార్టీ నేత రవిలు పిటిషన్‌లు దాఖలు చేశారు. రాజీనామాలను ఆమోదిస్తూ స్పీకర్‌ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ప్రక్రియ పెండింగ్‌లో ఉండగానే, సరైన విచారణ లేకుండా వారి రాజీనామాలను ఆమోదించారని పిటిషనలో ఆరోపించారు. పార్టీ విప్‌ను ఉల్లంఘించి టివికె ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేశారన్న కారణంతో ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్‌ దాఖలైంది. మద్రాస్‌ హైకోర్టు విచారణకు ముందు, అసెంబ్లీ స్పీకర్‌ నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్