మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వైసిపి మహిళా విభాగం నిరసన ర్యాలీ

6 గంటల క్రితం

YCP Women's Wing protest rally
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 12:09 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, అత్యాదారాలు, హత్యలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నప్పటికీ, వాటిని నిరోదించడంలో ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదు. ఇక పోలీస్ యంత్రాంగం పూర్తిగా అధికార పార్టీ తొత్తుగా మారిపోవడం దురదృష్టకరమని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి కోలగట్ల శ్రావణి,జిల్లా అధ్యక్షులు గదులు సత్యలత,బొత్స అనూష,.మాజీ జెడ్పీ చైర్మన్ శోభా స్వాతిరాణి అన్నారు. మంగళవారం రాష్ట్రంలో మహిళలు మీద జరుగుతున్న దాడులకు నిరసనగా స్థానిక సంస్కృత కళాశాల నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం. వారు మాట్లాడుతూ .... ఇటీవల గుంటూరు బద్వేలు తదితర ప్రాంతాల్లో మహిళలను వివస్త్రలను చేసి అవమానించిన అమానవీయ ఘటనలు రాష్ట్రంలో దారుణంగా మారిన పరిస్థితికి అద్దం పడుతున్నాయన్నారు. అలాంటి ఘటనలు నాగరిక సమాజానికి మాయని మచ్చగా నిలుస్తాయన్నారు. కొన్ని ఘటనల్లో నిందితులకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కేసుల నమోదులో జాప్యం, విచారణలో నిర్లక్ష్యం, నిందితులపై చర్యలు తీసుకోవడంలో ఉదాసీనత ప్రదర్శిస్తే బాధితులకు న్యాయం జరగదన్నారు. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకాన్ని ప్రజల్లో నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.అందుకే మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థలు, మహిళా పోలీస్ స్టేషన్లు, హెలైన్లు, పెట్రోలింగ్ బృందాలు సమర్థవంతంగా పని చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడంలో ఏ మాత్రం వివక్ష చూపొద్దన్నారు. వీటన్నింటిపై టీడీపీ కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి, తన బాధ్యత నిర్వర్తించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైసీపీ మహిళా విభాగం నాయకులు తూముల అచ్యుతవల్లి, విజయనగరం మాజీ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్