ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గణపవరంలో 148 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు

22 గంటల క్రితం

గణపవరం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 12:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - గణపవరం(పశ్చిమగోదావరి) : మండలంలో నేడు జరగనున్న పంచాయతీ ఎన్నికలకు 148 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో జి. రంగనాయకులు తెలిపారు. ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు పోలింగ్‌ అధికారులు (పీఓలు), సహాయ పోలింగ్‌ అధికారులు (ఏపీఓలు) శనివారం మండల పరిషత్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విధులకు హాజరైన అధికారులు, సిబ్బంది నుంచి సంతకాలు తీసుకుని ఎన్నికల కేంద్రాలకు పంపిస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ఎన్నికల విధులకు వెళ్లే సిబ్బందికి టీ, టిఫిన్‌తో పాటు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్