సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆచంటలో మూతపడిన బ్యాంకులు

11 సెప్టెంబర్, 2026

Banks closed in Achanta
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 11:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమ గోదావరి జిల్లా) : పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. 5 రోజుల పని దినాలు అమలు చేయాలని కోరుతూ .... యునైటెడ్ ఫారం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపులో భాగంగా దేశవ్యాప్త సమ్మె కారణంగా శుక్రవారం మండలంలో ఆచంట, కొడమంచిలి , వల్లూరు గ్రామాల్లో ఉన్న బ్యాంకులు మూతపడ్డాయి. అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలని  పెన్షన్ల పెంపు, ఓ పి ఎస్ అమలు వంటి డిమాండ్లతో ఈ సమ్మె చేపట్టినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. కాగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నగదు జమలు, విత్ డ్రాయల్స్, చెక్కుల క్లియరెన్స్ వంటి  బ్యాంక్ సేవలకు ఆటంకం కలిగింది. మొబైల్ బ్యాంకింగ్ ఏటీఎం సేవలు యథావిధంగా కొనసాగుతున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్