జక్కంశెట్టి సత్యనారాయణ
ప్రజాశక్తి-గణపవరం: మండల కేంద్రం గణపవరంలో దళితులకు చెందిన స్మశానాన్ని ప్రభుత్వం సర్వేచేసి ఆక్రమణల చెర నుండి విముక్తి కల్పించాలని ఆంద్రప్రదేశ్ వ్వసాయసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ అధికారులను కోరారు. కులవివక్షత లేని సమాజం కొరకు ఆంద్రప్రదేశ్ వ్వవసాయ కార్మికసంఘం, ప్రజాసంఘాల ఆద్వర్యంలో చేపట్టిన సామాజిక శంఖారావంలో భాగంగా బుధవారం గణపవరం దళిత పేట సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ ఆద్యాయన బృందం కౌలురైతు సంఘం జిల్లా సహయ కార్యదర్సి పెచ్చేట్టి నరశింహమూర్తి స్తానిక కార్మిక సంఘనాయకులు కె త్రినాధ్ కెవిపిఎస్ జిల్లా సహయ కార్యదర్సి చిన్నం చిననాగేశ్వరావు, వ్వవసాయ కార్మిక సంఘం మండల అద్యక్షులు సోడదాసి సంజీవిరావు ధళితవాడల పర్యటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధళితుల కు చెందిన శ్మశానం ప్రభుత్వ రికార్డులలో ఏడు ఎకరాలు తోంభై సెంట్లు ఉన్నట్లు ఉందని చెప్పారు. కాని ఒక ఎకరంలోపు మాత్రమే ఉపయేగంలో ఉందని తెలిపారు. పంచాయతీ సరఫరా చేసే త్రాగునీరు వాడకానికి తప్ప త్రాగటానికి పనికి రావటం లేదని దళితులు చెప్పారు. రోడ్లు డ్రైయినిజులు పూడిపోయి వర్షంవస్తే ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఆలేగే జగన్నాదపరంలో వేగేశ్న ట్రుస్టు వారు నాడు 20 మందికి దళితులకు ఇచ్చిన స్థలాల్లో డ్రైనీజి సౌకర్యం మంచినీటి సౌకర్యాలు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. విద్యుత్ స్థంబాలు తగినన్ని లేవని వెంటనే వేయాలని తెలిపారు. రానున్న రోజుల్లో ఈ సమస్యలపై ఆందోళన చెపడతామని బృందం సభ్యులు తెలిపారు.







కామెంట్‌లు (0)