శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

హాస్టల్ విద్యార్థినులకు మెటీరియల్ పంపిణీ

2 రోజుల క్రితం

education
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 11:54 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

 ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా): కూటమి ప్రభుత్వం బాలికల విద్యకు ప్రోత్సాహం అందిస్తూ అమ్మాయిలు చదువులు మధ్యలో ఆగిపోకుండా వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు గ్రామంలోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థినులకు బ్లాంకెట్స్, నైట్ డ్రెస్సెస్, స్వెటర్స్, టర్కీ టవెల్స్, స్టీల్ ప్లేట్లు మరియు గ్లాసులను  ఎమ్మెల్యే పితాని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పితాని  మాట్లాడుతూ, విద్యార్థుల సంక్షేమం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముఖ్యంగా బాలికల విద్యాభివృద్ధికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన వసతులు అందిస్తున్నామని తెలిపారు.హాస్టల్‌లోని విద్యార్థినులతో ఆయన ఆప్యాయంగా మాట్లాడి, వారి చదువు, ఆరోగ్యం, హాస్టల్‌లో అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, హాస్టల్ సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్