ప్రజాశక్తి–ఉండి(పశ్చిమగోదావరి) : కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారిగా పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. దీంతో ఉండి మండలం పెద్దపుల్లేరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వృద్ధులు, వితంతువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే పంచాయతీ కార్యాలయం వద్ద దరఖాస్తుదారులు బారులు తీరారు. అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తుల నమోదుకు వారు వేచి ఉన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరించి, నిబంధనల ప్రకారం పరిశీలన పూర్తిచేసి పింఛన్లు మంజూరు చేయాలని గ్రామస్తులు అధికారులను కోరారు.
పింఛన్ల దరఖాస్తుల కోసం బారులు తీరిన వృద్ధులు
16 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 12:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)