నిరంతరం ప్రజలతో కలిసి నడిచే సిపిఎం అభ్యర్థులను గెలిపించి కౌన్సిల్లో మాట్లాడే అవకాశం ఇవ్వండి :
సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి. గోపాలన్.
ప్రజాశక్తి - భీమవరం : సిపిఎంను గెలిపించడం అంటే ప్రజలు తమను తాము గెలిపించుకోవడమేనని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ అన్నారు. గురువారం లంకపేట లో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి సిపిఎం కు ఓట్లు వేయమని సిపిఎం అభ్యర్థి మర్రి సోమేశ్వరరావు తో కలిసి ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా గోపాలన్ మాట్లాడుతూ.. ప్రజల నివాసాలను తొలగిస్తున్నప్పుడు, ప్రజల మీద పాలకులు భారాలు మోపుతున్నప్పుడు, త్రాగునీరు వంటి సమస్యలు ప్రజలను వేధిస్తున్నప్పుడు సిపిఎం ప్రజలకు అండగా నిలబడి ఉద్యమిస్తుందని అన్నారు. అధికారంతో నిమిత్తం లేకుండా ప్రజల ప్రయోజనాల కోసం విలువలతో కూడిన పోరాటం సిపిఎం నిర్వహిస్తుందని అన్నారు. సిపిఎం కు ఓట్లు వేయడం అంటే ప్రజలు తమకు తామే ఓట్లు వేసుకున్నట్లు అని అన్నారు. కౌన్సిల్లో ప్రజల తరఫున మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని కోరారు. 49 వ వార్డు లంకపేట, దుర్గాపురం లో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి వాసుదేవరావు, ఎం ఆంజనేయులు, సిహెచ్ వరలక్ష్మి, వద్దిపర్తి శ్రీనివాసు, దండు బోయిన త్రిమూర్తులు, సాయమ్మ, కుమారి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)