ప్రజాశక్తి - ఆచంట : దేశంలో అప్రజాస్వామ్యంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి కోట్లాది మంది ఓట్లు తొలగించిన కేంద్ర ఎన్నిల ప్రధాన కమీషనర్ జ్ఞానేష్ కుమార్‌ని వెంటనే తొలగించాలని రైతు,కార్శిక సంఘాల ఆద్వర్యంలో ఆచంట మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్బంగా ఏపి కౌలురైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ.. దేశంలో ఎన్నికల కమీషనర్ కి వున్న అధికారం ప్రజలకు జవాబు దారీగా వ్యవహరించి, పౌరులకు ఓటు హక్కు కల్పించడమేనని, ఓటు తొలగించడం కాదని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, ఫారం 6 లో వ్యక్తి గతంగా మార్పులు చేసి, పదమూడు కోట్ల మంది ఓట్లు తొలగించిన జ్ఞానేష్ కుమార్‌ని తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం ఎన్నికల కమీషనర్ ద్వారా ప్రజాస్వామ్యంపై దాడి చేస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలంతా బిజెపిని గద్దె దించేవరకు పోరాడాలని, జ్ఞానేష్ కుమార్ ని తక్షణమే పదవి నుండి తొలగాంచాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సి. ఐ. టి. యు, కౌలురైతు, వ్యకాస నాయకులు కలుపూరి బుల్లబ్బాయి, దాసిరెడ్డి కోటేశ్వరరావు జయరాజు, కేతా నాగ ఆంజనేయులు, కేతా పూర్ణారావు, కొండేటి సురేష్, బండి శ్రీనివాసు, బొక్కా సూర్యనారాయణ,పద్మారావు,మల్లుల వెంకటేశ్వర్లు తధితరులు పాల్గొన్నారు.
జ్ఞానేష్ కుమార్ ని తొలగించాలని రైతు, కార్మిక సంఘాల ఆందోళన
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 10, 2026, 05:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)