శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం ఉన్నత సేవ

1 గంట క్రితం

ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం ఉన్నత సేవ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 07:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - మంగళగిరి

ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి లేదని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. శనివారం మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి మెట్ల మార్గం వద్ద శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయ్ రావు మాట్లాడుతూ మంగళగిరి శ్రీ గంగాభ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం వద్ద శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజున సుమారు 5 వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పుప్పాల కోటేశ్వరరావు, కర్నాటి శివ సత్యనారాయణ, కే శ్రీను, పంచల శివన్నారాయణ, నంద్యాల గోపాలకృష్ణ, మధు, రెడ్డి వీర రాఘవులు, ముద్ర బోయిన శ్రీనివాసరావు, పందేటి శ్రీను, వద్దంటి మురహరి, గండికోట రాజారావు, గండికోట అచ్చయ్య, బి శివ ప్రసాద్, దుంపల సోములు, నంగళం ప్రసాద్, కటారి విష్ణుమూర్తి, గండికోట దుర్గారావు, కోదాటి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

యాడ్ పర్పస్ ఫోటో పెట్టగలరు.

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్