సోమవారం, 17 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రేషన్ కార్డు దారులకు రూ.52కే సన్నబియ్యం..

03 ఆగస్టు, 2026

rice
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 11:54 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పితాని

ప్రజాశక్తి–ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా): రేషన్ కార్డు దారులకు మార్కెట్ ధర కంటే దాదాపు రూ.10 తక్కువకు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందిస్తున్నామని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఆచంటలోని జైన్ దేవాలయం సమీపంలోని రైస్ మిల్ వద్ద ఏర్పాటు చేసిన బియ్యం విక్రయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సామాన్య ప్రజలపై నిత్యావసర వస్తువుల ధరల భారం తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీ ధరకు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో స్టీమ్ సోనా రకం సన్నబియ్యాన్ని కిలోకు రూ.52కే ప్రభుత్వం అందిస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్ బాబు, ఏఎంసీ చైర్మన్ కేత సత్యవతి మీరయ్య, కోళ్ల సత్యనారాయణ, బీకేడీ ప్రసాద్, తహసీల్దార్ కుమార్, కూటమి నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్