గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పింఛన్ దరఖాస్తులకు సమయం పెంచాలి : సిపిఎం

1 గంట క్రితం

cpm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 04:31 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఎలి నినో ప్రభావంతో నష్టపోతున్న రైతులను ఆదుకోవాలి : సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు

ప్రజాశక్తి - చిత్తూరు : సిపిఎం జిల్లా కమిటీ సమావేశం గురువారం చిత్తూరు సిపిఎం కార్యాలయంలో గిరిధర్ గుప్త అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా ప్రజా ఉద్యమాలు చేసే వారిని ఉక్కు పాదంతో అణచడానికి ప్రయత్నం చేస్తోందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గోకులం షెడ్లు జిల్లాలో ప్రజాప్రతినిధులు కోటా ప్రకారం ఇచ్చారని, కానీ వాటిలో అనేక రకాల అవినీతి జరిగినట్లు, ప్రజాధనం దుర్వినియోగమైనట్లు ఆరోపణలు ఉన్నాయని, వీటిపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ.. జిల్లాలో ఎలినినో ప్రభావం తీవ్రంగా ఉందని అన్నారు. నీరు అడుగంటి పోవడంతో వ్యవసాయ పంసెట్లలో కూడా నీరు రాక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు పడతాయన్న ఆశతో కొందరు రైతులు వేరుశనగ పంట వేశారని, వర్షాలు లేక ఎండిపోయిన పరిస్థితి ఉందన్నారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అత్యధికంగా ఉన్న మామిడి రైతులకు నాలుగు రూపాయల ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ అందరికీ వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేసినా, దరఖాస్తు విధి విధానాలు వారిని ఇబ్బందికి గురిచేస్తున్నాయని అన్నారు. దీంతో ఎంతో మంది అర్హులు నష్టపోయే పరిస్థితి ఉందని తెలిపారు. 19 తేదీ వరకు సమయం ఉందని చెప్పుకోవడంతో ప్రభుత్వం అడిగిన అన్ని రకాల పత్రాలు సమర్పించాలంటే అధికారులు ఆఫీసుల్లో అందుబాటులో ఉండటం లేదని, సర్వర్లు పనిచేయడం లేదని. పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పింఛన్ల దరఖాస్తుల కోసం సమయం పెంచాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం పోటీ చేస్తుందని జిల్లా కమిటీ తీర్మానం చేసింది. జిల్లాలో ఉన్న ప్రజా సమస్యలపైన పోరాటాలు చేయాలని తీర్మానించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు సురేంద్రన్ ,ఓబుల్ రాజు, షకీలా తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్